Type Here to Get Search Results !

సర్దార్ సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తి ఆదర్శనీయం:హైకోర్టు అడ్వకేట్ నల్లమాస కృష్ణ.

  • సర్దార్ సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తి ఆదర్శనీయం.
  • హైకోర్టు అడ్వకేట్ నల్లమాస కృష్ణ.
  • బహుజన చక్రవర్తి ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం.
  • కొమ్ములవంచలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ.


నర్సింహులపేట, జూన్ 28 (నమస్తే న్యూస్)

సర్దార్ సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని హైకోర్టు అడ్వకేట్ నల్లమాస కృష్ణ అన్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నల్లమాస కృష్ణ మాట్లాడుతూ, బహుజనుల హక్కులు, సంక్షేమం కోసం కులవృత్తుల ప్రజలను ఏకం చేసి పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు చేరవేసేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.విగ్రహ నిర్మాణానికి సహకరించిన గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.యువత సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులర్పించారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.