ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ చోరీ.. కేసు నమోదు.
చట్టాలను అతిక్రమించేవారు పోలీసుల నుండి తప్పించుకోలేరు.
ఎస్సై బానోత్ వెంకన్న.
![]() |
| ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై బానోత్ వెంకన్న |
నరసింహులపేట, జూలై 02 (నమస్తే న్యూస్ క్రైమ్):
ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న బీఆర్‌కే బ్రిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు చెందిన కాపర్ వైర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన నరసింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం, బీఆర్‌కే బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్‌ను దుండగులు రాత్రి సమయంలో అపహరించారు. ఈ ఘటనపై జేఎల్‌ఎం (JLM) ఫిర్యాదు మేరకు నరసింహులపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా నరసింహులపేట ఎస్‌ఐ బానోత్ వెంకన్న మాట్లాడుతూ, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సామగ్రి లేదా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



