కేంద్ర ప్రభుత్వ చర్యలకు గ్రామ పంచాయతీ ముందు నిరసన.
వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి.
కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య.
డోర్నకల్/మరిపెడ(జూలై 01)నమస్తే న్యూస్.
జులై 01నుండి వి బి జి రాంజీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల ముందు నిరసనలు తెలియజేయాలని అఖిల భారత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు,ఏ ఐ కె ఎస్,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.నిరసనకు కెవిపిఎస్ జిల్లా కమిటీ తరపున ఆసంఘం జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య సంపూర్ణ మద్దతును ప్రకటించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినతి పత్రాన్ని స్థానిక పంచాయతీ సెక్రెటరీకి అందజేశారు.ఈ సందర్భంగా జిన్నా లచ్చయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోరాడి వామపక్షాల మద్దతుతో సాధించుకున్న మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసింది దీని స్థానంలో విభీజీ రాంజీ చట్టాన్ని తేవటం జరిగిందని తెలిపారు.125 రోజులు పని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసింది.కానీ ఈ పనిలో నిధుల కోత విధిస్తూ చర్యలు చేపట్టింది.రాష్ట్ర ప్రభుత్వానికి 40 శాతం,కేంద్ర ప్రభుత్వాన్ని 60 శాతం నిధులు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం నిబంధనాలను చట్టంలో తీసుకొచ్చింది.దీంతో పనిచేసిన వారికి సరైన టైంలో డబ్బులు పడక కూలీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తెచ్చినప్పటికీ కనీస వేతన చట్టాన్ని ఈ చట్టంలో పొందుపరచలేక పోవడం దురదృష్టకరం.పని చేసిన ప్రదేశం లోనే ఫోటో అప్లోడ్ చేయాలని పెట్టడంతో ఆ ప్రదేశంలో గూగుల్ నెట్ పనిచేయక గ్రామపంచాయతీ ఏరియా రాంగ్ పడే అవకాశం ఉందని తెలిపారు.ఆరోజు కూలీలు పనిచేసిన ఫోటో అప్లోడ్ కాకపోవడంతో డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.తద్వారా లేబర్ హాజరు లేదనే పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్లను,ఉపాధి సిబ్బందిని తొలగించి ఉద్యోగులను తప్పించే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.ఆంటీ వినాశకరమైన చట్టాలు తీసుకురావడంతో పేదలకు ఉపాధి కోల్పోయి భద్రత కరువయ్య అవకాశాలు ఉన్నాయన్నారు.వెంటనే వి బి జి రాంజీ చట్టాన్ని రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని యధావిదంగా కొనసాగించాలని కోరారు.300 రోజులు పని కల్పించి,కనీస వేతనం రోజుకు 600 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడ సోమన్న,సిపిఎం వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ,రైతు సంఘం జిల్లా నాయకులు నందిపాటి వెంకన్న,సిఐటియు మండల నాయకులు జినక జామ్మూర్తి,జినక సైదులు,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జినక ఎర్ర వెంకన్న, రమణ, సుజాత, శ్రీదేవి, మాధవి, మైసమ్మ తదితరులు ఉన్నారు.

