పూణే లో
మాజీ ఎంపీ జన్మదిన వేడుకలు.
(నమస్తే న్యూస్ జనవరి 01, మహబూబాబాద్)
మహబూబాబాద్ మాజీ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత జన్మదిన వేడుకలను పూణే పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు బోడ లక్ష్మణ్ నాయక్, ఆధ్వర్యంలో కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల బిఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ భూక్యా సురేష్ నాయక్, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా నాయకులు భానోత్ పార్వతి సురేష్, భూక్యా వీరన్న తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

