మహిళా శక్తికి వందనం
నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
(నమస్తే న్యూస్,నర్సింహులపేట, మార్చి 08)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో మహిళా శక్తిని గౌరవిస్తూ ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహిళా పోలీసుల సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా ఎస్సై కొనియాడారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌కు ఎస్ఐ యం సురేష్ తో పాటు సహచర సిబ్బంది శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు పురుషులతో సమానంగా, అత్యంత ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.
ప్రతి మహిళా ఉద్యోగి తన వృత్తిలో రాణిస్తూనే సమాజ మార్పుకు కృషి చేయాలని, మహిళా సిబ్బందికి అన్ని వేళలా అండగా ఉంటామని స్టేషన్ అధికారులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


