(నమస్తే న్యూస్,దంతాలపల్లి,జనవరి 07)
దంతాలపల్లి మండల వనరుల కేంద్రంలో యుటిఎఫ్ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారి ఎం. శ్రీదేవి , జిల్లా కార్యదర్శి ఈ. రమేష్ , ZPHS కుమ్మరికుంట్ల ప్రధానోపాధ్యాయులు వెంకటరాజయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం యుటిఎఫ్ కార్యకలాపాలు మరింత బలోపేతం కావాలని పాల్గొన్న ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మండల శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వెంకన్న, ప్రధాన కార్యదర్శి కె. వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు బి. పార్వతీ రాథోడ్, ఎం. చిరంజీవి, కార్యదర్శులు యు. లింగయ్య, పి. అనిల్, కల్చరల్ కమిటీ కన్వీనర్ ఎ. రమేష్, సభ్యులు కె. సుమతి, ముప్పారం కాంప్లెక్స్ కన్వీనర్ ఎం. రమేష్, ఇతర బాధ్యులు సఫియా బేగం, రజనీకాంత్, ఉపేందర్, ఉపాధ్యాయులు వహీద్ పాషా, ప్రవీణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

