(నమస్తే న్యూస్,బయ్యారం, జనవరి 07)ఉద్యమ సమయంలో 13 సంవత్సరాలు ఉద్యమకారులను ఉపయోగించుకుని, ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారుల కుటుంబాలను ఒక్కరోజైనా గుర్తు చేసుకోని నాయకులు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఉద్యమకారులు ఐక్యంగా ఉండాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పిస్తూ, తెలంగాణ ఉద్యమకారులకు మరియు కళాకారులకు అభివందనలు తెలిపారు.తెలంగాణలో సుమారు 60 నుండి 75 వేల ఉద్యమకారుల కుటుంబాల గోషను వినకుండా, వారి సమస్యలను పట్టించుకోకుండా ఉన్నవారు,నేడు ముసలి కన్నీళ్లు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.గత ఎనిమిదేళ్లుగా డాక్టర్ చీమ సీనన్న, వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్, జనగామ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటే, కొందరు కుట్రలు చేసి మనలో మనలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తమను వాడుకున్న నాయకుల కపట రాజకీయాలను నమ్మకుండా ఉద్యమకారులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్లు కష్టాలు పడిన ఉద్యమకారులకు మంచి రోజులు దూరంలో లేవని, మన హక్కులను మనమే పోరాడి సాధించుకోవాలనే అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రస్తావించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. మురళి నాయక్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

