పోలింగ్ స్టేషన్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు.
పోలింగ్ ముగిసే వరకు నిరంతర నిఘా.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.
ఎన్నికల సజావుగా సాగేలా ప్రజలు సహకరించాలి.
-జిల్లా ఎస్పీ శబరిష్
(నమస్తే న్యూస్,డిసెంబర్ 09, మహబూబాబాద్ క్రైమ్)
జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు.జిల్లా పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది తొ జిల్లా ఎస్పీ శబరీష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసారు.పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతిభద్రతలు దృఢంగా ఉండేలా సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఉదయం నుంచే పోలీసులు తమ స్థానాల్లో చేరి, ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయడానికి అన్ని రకాల సౌకర్యాలు మరియు భద్రతా చర్యలను ఎంచుకుంటారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపుల గుమికూడింపులు పూర్తిగా నిషేధిం అన్నారు. అవసరం లేకుండా తిరిగే వ్యక్తులను పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద చర్యలు కనబడితే వెంటనే స్పందించాలని అన్నారు.సెన్సిటివ్ మరియు హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో అదనపు పికెటింగ్, వీడియో రికార్డింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయబడ్డాయి. పోలింగ్ స్టేషన్‌లో ప్రచార సామగ్రి, మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు తీసుకురావడం అనుమతించబడదని తెలిపారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకోసం ప్రత్యేక క్యూలైన్లు అమల్లో ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను కఠిన భద్రతా చర్యల మధ్య రిసీవింగ్ సెంటర్లకు తరలిస్తారు. రూట్ మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉండి, ఎటువంటి అప్రతీక్షిత ఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు.బ్యాలెట్ బాక్స్ రవాణాలో ఉండే ఏ టీమ్‌కైనా తమ స్థానాన్ని విడిచి వెళ్లే అవకాశం లేదన్నారు.పోలీస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, వైర్‌లెస్, VHF సెట్లు పూర్తిగా పని చేయాలి. మొబైల్ పార్టీలు, పికెట్స్, చెక్ పోస్టులు, బాండోబస్తు టీమ్స్ అన్ని సమయాల్లో అలర్ట్‌లో ఉండాలని పేర్కొన్నారు. ఓటర్ల రాకపోకలు, రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ కంట్రోల్ అన్నీ సక్రమంగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.జిల్లాలో ఎక్కడైనా ఉద్రిక్తత, గుంపుల గుమికూడింపు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతలను భంగం కలిగించే ఏ వ్యక్తికైనా అవకాశం ఇవ్వొద్దన్నారు.ఎన్నికల కోడ్ దృశ్య ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధం అని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనియా జరుగకుండా ప్రశాంతమైన వాతావరణం లో జరిగేందుకు ఎన్నికల బందోబస్తులో ( 05) డిఎస్పీలు, (16)ఇన్స్పెక్టర్లు, (60) ఎస్.ఐలు మొత్తం 1000 మంది పోలీస్ సిబ్బంది మొదటి విడుత ఎన్నికలలో విధిలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.మొత్తం జిల్లాలోని పౌరులు ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావించి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రజలను కోరారు.

