నాటు సారాయి స్థావరాలపై పోలీసుల దాడులు.
(నమస్తే న్యూస్,మరిపెడ,డిసెంబర్ 09)
నాటు సారాయి తయారీ చేసిన తరలించిన కఠిన చర్యలు ఉంటాయని, మరిపెడ సిఐ రాజకుమార్ హెచ్చరించారు.మరిపెడ మండల పరిధిలో అక్రమ సారాయి తయారీపై పోలీసులు దాడులను మరింత వేగవంతం చేశారు.ఈ సందర్భంగా సోమ్లా తండాలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు సారాయి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి, సారాయి తయారీకి పాల్పడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఈ. వీరభద్రరావు తెలిపారు. సారాయి తయారీ, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, పాల్పడిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఉదయం మరిపెడ సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డాన్ అండ్ సెర్చ్ లో తండాలో ఉన్న సారాయి స్థావరాలపై దాడి చేసి భారీగా సారాయి పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అక్రమ సారాయి తయారీలో పాల్గొన్న 6 మందిపై కేసులు నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ రాజ్ కుమార్, ఎస్సైలు వీరభద్రరావు, కోటేశ్వరరావు, అలాగే సిబ్బంది పాల్గొన్నారు.





