అల్లర్లు సృష్టిస్తే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం
-డిఎస్పి కృష్ణ కిషోర్
(నమస్తే న్యూస్ దతాలపల్లి,డిసెంబర్ 08)
దంతాలపల్లి మండలం లోని రైతు వేదికలో ఆదివారం స్థానిక సర్పంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఎస్పి కృష్ణ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల నియమా వాళ్ళని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి ప్రచారం చేసుకోవాలని. ప్రచారం నిమిత్తం మైకు తదితర పర్మిషన్లు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అనుసరించి ఖర్చు పెట్టాలని మద్యం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. ఉదయం 10 గంటల నుండి 5 వరకు సాయంత్రం ప్రచారాన్ని చేపట్టాలని. గెలుపోటములు సహజమని అభ్యర్థులకు సూచించారు. గెలిచినవారు రెండు రోజుల వరకు ర్యాలీలు సమావేశాలు నిర్వహించోద్దని తెలియజేశారు . కార్యక్రమంలో తహసిల్దార్ సునీల్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో విజయ,స్థానిక ఎస్సై పిల్లల రాజు తదితరులు పాల్గొన్నారు.



