కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
టికెట్ రాని వారికి సమచిత స్థానం కల్పిస్తాం.
పార్టీ అభ్యర్థుల గెలుపుకై కృషి చేయాలి.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్
(నమస్తే న్యూస్,దంతాలపల్లి, డిసెంబర్ 2)
మండల రాజకీయాల్లో వేడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను ఉల్లంఘించేవారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ఉన్నప్పటికీ టికెట్ రాకపోతే స్వతంత్రంగా సర్పంచ్ నామినేషన్ వేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే… అలాంటి వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టికెట్ రాని నాయకులకు పార్టీలో ఎప్పటికీ గౌరవ స్థానమేనని, వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పారు.అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 50 మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. నూతన కార్యకర్తల చేరికలతో సభా స్థలం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు బట్టు నాయక్, పీఎసీసీ చైర్మన్ సంపేట రాము గౌడ్, నాయకులు గురుపాల్ రెడ్డి, కసిరెడ్డి నవీన్ రెడ్డి, గిర్వాణి, కొమ్మినేని సతీష్, జెట్టి ఆజాద్ చంద్రశేఖర్, గుమ్మడవెల్లి పర్షయ్య, బాలాజీ, దుండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

