సామాజిక అసమానతలను తొలగించడమే అసలైన నివాళులు. తహసిల్దార్ రమేష్ బాబు.
సామాజిక న్యాయ ఎజెండా కొనసాగించడమే ఆ మహనీయుడికి నిజమైన నివాళి-మందుల యాకూబ్.
(నమస్తే న్యూస్, డిసెంబర్ 06, నర్సింహులపేట)
అంబేద్కర్ అందించిన సామాజిక న్యాయ ఎజెండా కొనసాగించడమే ఆ మహనీయుడికి అందించే నిజమైన నివాళి అవుతుందని కెవిపిఎస్ జిల్లా నాయకులు మందుల యాకూబ్ అన్నారు.నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం అంబేద్కర్ యువజన సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్ ) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా తహసిల్దార్ రమేష్ బాబు పాల్గొన్నారు. ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక అసమానతలను తొలగించడమే మనం అంబేద్కర్ ఇచ్చే నివాళులు కొనియాడారు. సభ అనంతరం విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వినోద్ కుమార్, భాస్కర్, జిపిఓ బిక్షపతి, మాజీ సర్పంచ్ మందుల యాకన్న వివిధ పార్టీల నాయకులు గోపాల్ రెడ్డి అశోక్ రెడ్డి కె వి పి ఎస్ నాయకులు మందుల యాకూబ్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామ్మూర్తి సమర పరశురాములు, నాగరాజు కోలా యాకయ్య జాఫర్ రావుల శీను చుక్క వెంకన్న మందుల ఉప్పలయ్య గండి శారద ఉపాధ్యాయులు సతీష్, కైతా వీరయ్య మందుల వెంకన్న దారం వెంకట మల్లు తదితరులు పాల్గొన్నారు.

