Type Here to Get Search Results !

హోమ్ గార్డ్ లు విధులను సమర్థవంతంగా నిర్వహించాలి-జిల్లా ఎస్పీ డా.శబరిష్.

హోమ్ గార్డ్ లు  విధులను సమర్థవంతంగా నిర్వహించాలి.

హోంగార్డ్స్ కూడా పోలీస్ వ్యవస్థలో భాగమే.

హోమ్ గార్డ్  ల సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉంది.

జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఐ.పి.ఎస్

63వ హోంగార్డ్స్ రైసింగ్ డే సందర్భంగా రైసింగ్ పరేడ్.




(నమస్తే న్యూస్,మహబూబాబాద్,డిసెంబర్ 06)

కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, హోమ్ గార్డ్ లు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ,హోంగార్డ్స్ కూడా పోలీస్ వ్యవస్థలో భాగమని, వారి సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ శబరిష్ అన్నారు.

63వ హోంగార్డ్స్ రైసింగ్ డే ను పురస్కరించుకొని, జిల్లా పోలీసు కార్యాలయం నందు రైసింగ్ పరేడ్ నిర్వహించడం జరిగింది. హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ ఇన్స్పెక్ట్ చేశారు.  ఈ సందర్బంగా ఎస్పీ డా.శబరీష్  మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, అంతర్గత భద్రతలో పోలీస్ శాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో 1946 డిసెంబర్ 6న స్వచ్ఛంద   ఏర్పాటైనదే హోంగార్డ్ వ్యవస్థ అన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో, శాంతి–భద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ చేస్తున్న కృషికి అదనపు బలం అందించేందుకు స్వచ్ఛంద సేవా భావంతో పనిచేసే, శిక్షణ పొందిన సిబ్బందే హోంగార్డ్స్ అని, హోంగార్డ్స్ కూడా పోలీస్ వ్యవస్థలో భాగమని, వారి సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉంది అన్నారు.

హోంగార్డ్స్ సిబ్బంది రోజువారీ వేతనాన్ని ₹921 నుండి ₹1000కి పెంచడం, పరేడ్ అలవెన్స్‌ను ₹100 నుండి ₹200కు పెంచడం జరిగింది. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సహకారంతో ₹33 లక్షల హెల్త్ కవరేజ్ అందించబడుతోంది. పోలీసు సిబ్బందితో సమానంగా రైన్ కోట్, ఉలెన్ జాకెట్ వంటి అవసరమైన సామగ్రి అందించబడం జరుగుతుంది. యాక్సిడెంటల్ భీమా ప్రయోజనాలు అందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ, అసాధారణ మరణం పొందిన 23-మంది హోంగార్డ్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ ₹5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయబడం జరుగుతుంది అన్నారు. పోలీస్ సేలరీ ప్యాకేజ్‌లో భాగంగా యాక్సిడెంటల్ డెత్‌కు ₹30 లక్షలు, ఇద్దరు పిల్లల చదువుకోసం ఒక్కొక్కరికి ₹2 లక్షలు ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, మీకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ సిబ్బందిని రివార్డ్స్ ద్వారా ప్రోత్సహించడం జరుగుతుంది అన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమం లో అడ్మిన్ డిఎస్పీ గండ్రతి మోహన్,టౌన్ డిఎస్పీ తిరుపతి రావు, ఏ.అర్ డిఎస్పీ శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, అర్.ఐలు భాస్కర్, సోములు అనిల్, నాగేశ్వర్రావు, అర్.ఎస్.ఐ శేఖర్ హోమ్ గార్డ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.