అంబరాన్ని అంటిన ప్రమాణస్వీకారం.
ఒకే తాటిపైకి వచ్చిన బీరిశెట్టి గూడెం గ్రామ ప్రజలు.
పండగ వాతావరణంలో జెట్టి మహేశ్వరి – ఆజాద్ చంద్రశేఖర్‌ల ప్రమాణ స్వీకారోత్సవం.
ప్రాణం ఉన్నంతవరకు ప్రజల అభివృద్ధికి పాటు పడుతా.
ప్రజలు నిరీక్షణ,పంతాలు వీడటం,కలిసి చర్చించుకోవడం అలవరుచుకోవాలి.
జెట్టి అజాద్ చంద్రశేఖర్,హై కోర్టు అడ్వకేట్.
![]() |
| ప్రమాణ స్వీకారం చేస్తున్న సర్పంచ్, ఉపసర్పంచ్ |
(నమస్తే న్యూస్,దంతాలపల్లి, డిసెంబర్ 23)
బీరిశెట్టి గూడెం గ్రామంలో ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఒక్కటైన దృశ్యం కనిపించింది. గ్రామ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చిన జెట్టి మహేశ్వరి – ఆజాద్ చంద్రశేఖర్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమం అంబరాన్ని అంటిన సంబరాలతో ఘనంగా జరిగింది.బీరిశెట్టి గూడెం లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది. గ్రామ వీధులన్నీ కిక్కిరిసిపోయేలా భారీ ర్యాలీ నిర్వహించగా, కనక డబ్బుల చప్పుళ్ళు, డీజే శబ్దాలతో ఆడపడుచులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రమాణస్వీకారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రమాణస్వీకారం అనంతరం ఆజాద్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “వృత్తిని వదిలిపెట్టను-ఊరును వదిలిపెట్టను ” అని స్పష్టం చేశారు. “ఊపిరి ఉన్నంతవరకు ఊరి అభివృద్ధికే పాటుపడతా” అని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో కుట్రలు, కుతంత్రాలకు తావులేదని… మనమంతా ఒక్కటే అంటూ ఐక్యత సందేశాన్ని ఇచ్చిన ఆజాద్, గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండి పోరాడతానని తెలిపారు. అలాగే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిని గ్రామానికి రప్పిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిధులను సొంత ప్రయోజనాలకు కాకుండా గ్రామ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తే గ్రామ అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన గ్రామస్తులను తిరిగి ఊరికి రప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామంలో త్వరలోనే వాణిజ్య పంటలకు శ్రీకారం చుడతామని, రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని ఆజాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, వాణిజ్య పంటలకు కోతుల బెడద లేకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాట్లకు బ్యాంకు రుణాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మహేశ్వరి ఆజాద్ మాట్లాడుతూ, “ఢిల్లీలో నేషనల్ అవార్డు మన గ్రామానికే రావాలి” అనే లక్ష్యాన్ని చేరుకునేలా ముందుకు సాగుదామని ప్రకటించారు. “మార్పు మనతోనే మొదలవ్వాలనీ నిరీక్షణ,పంతాలు వీడటం,కలిసి చర్చించుకోవడం అలవరుచుకోవాలనీ… ఢిల్లీ సైతం మన గ్రామం వైపు చూసేలా మన గ్రామాన్ని తీర్చిదిద్దుదామంటూ ప్రజలను ఉత్సాహపరిచారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం , గ్రామంలో కొత్త ఆశలు, కొత్త దిశకు నాంది పలికిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని ప్రజలు కొనియాడుతున్నారు.
![]() |
| హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న సర్పంచ్ దంపతులు. |
![]() |
| సర్పంచ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్న అభిమానులు |




