చింతపల్లిగూడలో వేగవంతంగా సీసీ రోడ్ల నిర్మాణం
80 శాతం పనులు పూర్తిచేసిన అధికారులు–త్వరలో ప్రారంభోత్సవం.
(నమస్తే న్యూస్, డిసెంబర్ 24 ,రంగారెడ్డి)
కొంగరకలన్ డివిజన్ పరిధిలోని చింతపల్లిగూడ గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి అని డాక్టర్ ఉక్కుల అశోక్ తెలిపారు. ప్రస్తుత పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, పనితీరు, నాణ్యతకు సంబంధించిన అంశాలపై గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతపల్లిగూడ, మల్షెట్టిగూడ, రాందాస్‌పల్లి, కోహెడ, అంబర్‌పేట్, హయత్‌నగర్, రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రోడ్డు ఇరువైపుల మట్టి తొలగింపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.నూతన సంవత్సరం శుభ సందర్భంలో ఈ రహదారిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్, చింతపల్లిగూడ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు శేరి రమేష్, ఉడుతల రవి గౌడ్, జోగు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

