ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు.
(నమస్తే న్యూస్,నరసింహులపేట,డిసెంబర్ 22)
విద్యార్థుల మేధస్సు వికాసానికి గణితం కీలక పాత్ర పోషిస్తుందని నరసింహులపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస అన్నారు.నరసింహులపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గణిత ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు వివిధ గణిత సమస్యలు, నమూనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులే ముందుకు వచ్చి గణిత ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం విశేషంగా నిలిచింది.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల మేధస్సు వికాసానికి గణితం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చిన్న వయసులోనే గణితంపై ఆసక్తి పెంపొందిస్తే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది శ్రీను, వేణుగోపాల్, సీత, యాకసైలు శ్రీనివాస్, కృష్ణ, జగన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


