గ్రామాభివృద్ధి
మా ధ్యేయం...ఆశీర్వదించండి.
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు దైద సుమలత వెంకన్న, గూగులోతు మంగీలాల్.
(నమస్తే న్యూస్ దతాలపల్లి,డిసెంబర్ 4) గ్రామాభివృద్ధి మా ధ్యేయమని రామవరం,దుబ్బతండ,మెగ్య తండ,రెక్య తండా గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు దైద సుమలత వెంకన్న,గూగులోతు మంగీలాల్ అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నామని, గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని,రాబోవు రోజుల్లో అంతర్గత సీసీ రోడ్లు, ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన ఇంటికి తీసుకువచ్చి ఎమ్మెల్యే సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తామని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను,నాయకులను,కార్యకర్తలను కోరారు.


