పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే..!చర్యలు తప్పవు.
మండల పార్టీ అధ్యక్షుడు బట్టు నాయక్
(నమస్తే న్యూస్ దతాలపల్లి,డిసెంబర్ 4 )ఈనెల 14న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ బట్టు నాయక్ ఓటర్లను కోరారు.గురువారం దంతాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరు నామినేషన్ వేసిన, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మండల శాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారికి నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు ఉపసంహరించుకొని పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయాలన్నారు.జిల్లా,మండల,గ్రామస్థాయి నాయకులు ఎవరైనా పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలకు గురవుతారని వారు అన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

