Type Here to Get Search Results !

ఇంటింటా ప్రచారంలో..! దూసుకుపోతున్న రింగ్ వీధులన్నీ సందడి..!

 ఇంటింటా ప్రచారంలో..! దూసుకుపోతున్న రింగ్ వీధులన్నీ సందడి


కాంగ్రెస్ రెబల్ సర్పంచ్ అభ్యర్థి కారు పోతుల సాయిదుర్గ- అనిల్


భార్యాభర్తలం ఇద్దరం ఉన్నత విద్యావంతులం


ఊరు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఆదరించండి 


ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించండి



(నమస్తే న్యూస్ దంతాలపల్లి,డిసెంబర్ 13)

ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి కారుపోతుల సాయిదుర్గ - అనిల్ ఓటర్లను అభ్యర్థించారు.గ్రామంలో అందరి నోట ఒకటే మాట సర్పంచ్ అభ్యర్థి సాయిదుర్గ - అనిల్ గెలుపు ఖాయం అంటున్నారు.శుక్రవారం బారీగా తమ మద్దతు దారులతో గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు.ఇంటింటికీ వెళ్లి మహిళలను పలకరించి బొట్టు పెట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా భర్త నేను ఇద్దరం ఆశయంతో గ్రామానికి సేవ చేయాలనే ధ్రుడ సంకల్పంతో సర్పంచ్ బరిలో నిలిచారని,గత కొన్ని సంవత్సరాలుగా నా భర్త చేస్తున్న సేవా కార్యక్రమాలు మీరందరు చూశారని అన్నారు.సర్పంచ్‌గా గెలుపుని సాధిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని ఆమె తెలియజేశారు.గత కొన్ని సంవత్సరాలుగా తమ శక్తిమేర సేవా కార్యక్రమాలు చేస్తున్నామని,మీ కష్టసుఖాల్లో పాలు పంచుకొని, గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నామని,గ్రామంలో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు:ఉన్నాయి.వాటిని పరిష్కరించుటకు  గ్రామంలోని పలు సంఘాల,నాయకులు సహకారంతో ముందుకు సాగుతానని,గ్రామ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలు,గ్రామ రహదారులు, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేయడం,యువతకు ఉపాధి అవకశాలు, క్రీడా మౌలిక వసతులు, పాఠశాల, అంగన్వాడీల అభివృద్ధి. మహిళల శ్రేయస్సు కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు పై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో గంధసిరి లక్ష్మయ్య,రాచకొండ మధు,గంధసిరి అమ్మయ్య రాములు,కొలనుపాక వీరస్వామి, కారుపోతుల జంపయ్య,చామకూరి నరేష్,కొంపెల్లి యాకయ్య,కారుపోతుల రాములు,ధైద భరత్, గంధసిరి ఉప్పలయ్య,సూత్రం వీరన్న,ఉపేంద్ర,సంధ్య, హైమ,యమున తో పాటు బారీగా గ్రామ ప్రజలు,నాయకులు,యువత ప్రచారంలో పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad