గెలుపొందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే.
గ్రామాల అభివృద్ధికి సర్పంచి పాత్ర కీలకం.
ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో సైనికుల వలె పని చేయాలి.
(నమస్తే న్యూస్, మరిపెడ,డిసెంబర్ 20)
సర్పంచ్ లు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ, సర్పంచ్ పదవి రాజకీయ భవిష్యత్తుకు తొలి మెట్టని,గ్రామ అభివృద్ధికి సర్పంచే కేంద్ర బిందువని, ప్రతి గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచేనని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచులకు సూచించారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్ము యుగంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్.కె. తాజుద్దీన్, అఫ్టల్, ఐలమల్లు, గుండగాని వెంకన్న, వేణు, సాయి, అభినవ రెడ్డి, అంబరీష్, రామ్లాల్, కాలం రవీందర్ రెడ్డి, దశ్రు నాయక్, కమలాకర్ రాజశేఖర్, అంబటి వెంకటరెడ్డి, బట్టు నాయక్, రాము నాయక్, లక్ష్మీపతి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

