తిర్మలాపూరం గ్రామ
బీఆర్ఎస్ పార్టీ నాయకుల సస్పెన్షన్
(నమస్తే న్యూస్, మహబూబాబాద్, డిసెంబర్ 20)
బీఆర్ఎస్ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలకు ఎలాంటి స్థానం లేదని, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ పార్టీ కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య విడుదల చేసిన పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు.మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం తిర్మలాపూరం గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైన నేతలపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది.సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సహకరించినట్లు ఆరోపణలతో, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కళ్లేపు శ్రీనివాస్ మరియు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కళ్లేపు సుధాకర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కురవి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా తోట లాలయ్య మాట్లాడుతూ ఇప్పటి నుండి నుంచి కళ్లేపు శ్రీనివాస్, కళ్లేపు సుధాకర్‌లకు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు.

