మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు.
పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను తాను ఎప్పటికీ మరచిపోను.
భవిష్యత్తులో వారికి పార్టీలో తగిన గుర్తింపు, మంచి స్థానం కల్పిస్తా.
మాజీ మంత్రి డి.ఎస్. రెడ్యా నాయక్.
![]() |
| గెలుపొందిన బిఆర్ఎస్ నాయకులను అభినందిస్తున్న డి.ఎస్.ఆర్. |
(నమస్తే న్యూస్, చిన్నగూడూరు, డిసెంబర్ 20)
పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను తాను ఎప్పటికీ మరచిపోనని, భవిష్యత్తులో వారికి పార్టీలో తగిన గుర్తింపు, మంచి స్థానం కల్పిస్తానని మాజీ మంత్రి డి.ఎస్. రెడ్యా నాయక్ అన్నారు.ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మాజీ మంత్రి, డోర్నకల్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.పడమటి గూడెం గ్రామపంచాయతీ నుంచి వార్డు నెంబర్ సభ్యుడు మంచాల శ్రీశైలం, గ్యామ తండా గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ భూక్య వినోద్–వీరూ నాయక్, ఉప సర్పంచ్ బానోతు జయ–శంకర్, అలాగే ఇతర వార్డు సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ గారు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను తాను ఎప్పటికీ మరచిపోనని, భవిష్యత్తులో వారికి పార్టీలో తగిన గుర్తింపు, మంచి స్థానం కల్పిస్తానని తెలిపారు.అలాగే పడమటి గూడెం గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పోరాటం చేస్తానని భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పడమటి గూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు హెచ్చు వెంకన్న ,మేకల వెంకన్న,మాజీ ఎంపీటీసీలు పాతూరి రమేష్ రెడ్డి,స్వామి నాయక్, గ్రామ పార్టీ నాయకులు వీరునాయక్,లకుపతి నాయక్,మాజీ ఉపసర్పంచ్ కుంబాల లింగయ్య,పాతూరి వెంకటరెడ్డి, మాజీ వార్డు సభ్యులు చిదిమిళ్ళ యుగంధర్, భద్రూ నాయక్ , చిదిమిల్ల ఆనంద్,వెంకన్న,నాయిని ఉప్పలయ్య ,వెన్ను వెంకన్న, ఆగయ్య,మంచాల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.



