ఐదోసారి సర్పంచ్ గా అవకాశం ఇచ్చిన దాట్ల ప్రజలకు రుణపడి ఉంటాం.
గత ముప్పై ఏళ్లుగా ప్రజలకు చేసిన సేవలు గుర్తుపెట్టుకుని గెలిపించారు.
ఆపదలో మీ కుటుంబ సభ్యుడినవుతా...!
మీ ఆనందాలలో భాగస్వామ్యమవుతా..!
-కొమ్మినేని మంజుల రవీందర్.
(నమస్తే మానుకోట,డిసెంబర్ 15, దంతాలపల్లి)
ఐదోసారి సర్పంచిగా భారీ మెజారిటీతో ఎన్నుకొని సేవ చేసే అవకాశం ఇచ్చిన దాట్ల ప్రజలకు రుణపడి ఉంటామని దాట్ల సర్పంచ్ కొమ్మినేని మంజుల రవీందర్ అన్నారు.రెండవ దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సందర్భంగా జంగాల బజార్ లో ఉన్న శివాలయం,దళిత వాడలో ఉన్న సవార్ లచ్చమ్మ గుడిలో, ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్యకర్తలు,అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి ప్రజలు తమ సమస్యలు తెలుపగా అతి త్వరలో పరిష్కరిస్తానని హామీఇచ్చారు..
రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపోవటములు సహజం.అలాగే రెండు మూడు సార్లు ఒకే వ్యక్తిని తమ ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని మరోసారి అవకాశం ఇవ్వకపోవచ్చు కానీ వారు మాత్రం 30 ఏళ్లుగా ఎన్నికల్లో ఓటమి చవి చూడలేదు. అది కూడా ఒకే గ్రామం నుండి సర్పంచిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి కూడా తమకు ఎదురులేదని నిరూపించారు. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన కొమ్మినేని మంజుల - రవీందర్ దంపతులు.గత 30 సంవత్సరాలుగా ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా నరసింహులపేటల మండలంలో దాట్ల గ్రామానికి కొమ్మినేని రవీందర్ రెండు సార్లు సర్పంచ్ గా గెలువగా,మూడవ సారి తన భార్య మంజుల సర్పంచ్ గా ఎన్నికైనారు.కొత్త మండలాలు ఏర్పడిన తరువాత నాలుగవ సారి రవీందర్ సర్పంచ్ గా ఎన్నికైనారు.ఈ నెల 14 న జరిగిన రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో 5 వ సారి తన భార్య కొమ్మినేని మంజుల సర్పంచ్ ఎన్నికలో 260 పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.సోమవారం గ్రామంలోని శివాలయంలో పూజ,చర్చిలో ప్రార్థనలు చేసినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో తాము సత్సంబంధాలు కలిగి ఉన్నామని అన్నారు. ఐదోసారి సర్పంచిగా భారీ మెజారిటీతో ఎన్నుకొని సేవ చేసే అవకాశం ఇచ్చిన దాట్ల ప్రజలకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోడిశెట్టి భాస్కర్, చిత్తలూరి వెంకటేశ్వర్లు,లక్ష్మణ్,సుధాకర్,యాకయ్య తదితరులు పాల్గొన్నారు.




