Type Here to Get Search Results !

ఆశతో కాదు ...!ఆశయంతో వస్తున్నా...! ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..!

 ఆశతో కాదు ...!ఆశయంతో వస్తున్నా...! ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా 


ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి కారుపోతుల సాయిదుర్గ - అనిల్


( నమస్తే న్యూస్,దంతాలపల్లి,డిసెంబర్ 10)

గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేయాలనే దృడ సంకల్పంతో పాటు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారు.గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే తమ ప్రధాన లక్ష్యంతో ప్రజల సమస్యలను తీర్చేటందుకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు .మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన కారుపోతుల సాయిదుర్గ - అనిల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల మధ్యన ఉంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.సొంత ఊరును అభివృద్ధి చేయాలని, దృఢ సంకల్పంతో విధ రకాల అభివృద్ధి పనులు చేస్తూ,ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు  సిద్ధమయ్యారు.మార్పును కోరుకుంటున్న ప్రజలు యువత వారు మాట్లాడే తీరు గతంలో వారు చేసిన సేవలు,వారి ముందు చూపు ప్రణాళికలు నిజాయితీగా అనిపిస్తున్నాయని అంటున్నారు.సాయిదుర్గ - అనిల్ కి గ్రామ ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు.


అనిల్ గ్రామానికి చేసిన సేవలు



2019 సంవత్సరంలో ప్రైమరీ స్కూల్లో త్రాగునీటి కోసం విద్యుత్ మోటర్ ఇపించారు.గ్రామంలో చనిపోయిన నిరుపేద కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం అందించారు.మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి రూపాయలు వెయ్యి నుండి సుమారు రు.2వేలు అందించారు.కోతుల బోను తయారీకి రు .10 వేలు ఆర్ధిక సాయం అందజేశారు.2022 సంవత్సరం నుండి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని చేపడుతున్నారు.ప్రతి యేటా వినాయక చవితికి అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించారు.విద్యార్థులుయువకులకు చదువు కోసం గ్రంథాలయాల నిర్మాణాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో నూతన భవనం కోసం భూమిని విరాళంగా ఇచ్చారు. దంతాలపల్లి - సూర్యాపేట ఆర్అండ్బి రోడ్డు బస్టాండ్ వద్ద భారీ వర్షానికి గుంతలమయం కావడంతో సొంత ఖర్చులతో కంకర తెప్పిచ్చి రోడ్డు గుంతలు పూడిపించారు. గ్రామంలో ప్రధాన సమస్య కోతుల బెడద ప్రజలు,రైతులు కోతుల ద్వారా నానా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో శాశ్వత పరిష్కారం కోసం బోను తయారు చేయాలనే సంకల్పంతో బారీ విరాళం అందించి బోను తయారు చేయించడానికి ముందుకు రావడాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.శ్రీ విఘ్నేశ్వర మహిళా అసోసియేషన్ ద్వారా మహిళల చిరకాల వాంఛ బతుకమ్మ ఘాట్ బతుకమ్మ తల్లి విగ్రహ ఏర్పాటు చేసి,కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో వృద్ధులకు,యువతకు అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చిన పరిష్కరించేందుకు ఆ దంపతులు కృషి చేస్తున్నారు.గ్రామంలో ఎవరికి ఏదైనా సమస్య వస్తే తనకు సమాచారం అందించిన వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు పాటుపడుతున్నారు.


 రాబోవు రోజుల్లో చేస్తానని హామీ ఇచ్చిన పనులు


గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం,ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి,పల్లె దవాఖాన నూతన భవన నిర్మాణం కోసం,అంగన్ వాడి భవన నిర్మాణ కోసం, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పెన్షన్లు అందే విధంగా,ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు,ప్రతి కుటుంబం శుద్దిత మంచి నీరు అందేలా కృషి చేస్తామని, వీధి దీపాల ఏర్పాటు,గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను చేసి మార్పును చూపిస్తామని ముందుకు వస్తున్నారు.గ్రామంలో మార్పు అభివృద్ధిని ఆశిస్తున్న ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.పారదర్శక పాలన ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి అనే ప్రధాన నినాదాలతో ముందుకెళ్తున్నారు.



 వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్న తీరు




కారుపోతుల సాయిదుర్గ - అనిల్ తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వినూత్నంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.పద్మశాలీల వద్దకు వెళ్లి మగ్గం నేస్తూ, కుట్టుమిషన్ కేంద్రాల వద్ద మిషన్ కుట్టుతూ, గృహిణుల వద్ద వారు చేస్తున్న పనుల్లో అసరవుతూ, తాము గ్రామానికి చేసిన సేవలను,రాబోవు రోజుల్లో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వివరిస్తూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు.


గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే ... ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం 

 

కారుపోతుల సాయిదుర్గ - అనిల్ దంపతులు మాట్లాడుతూ గ్రామానికి సేవ చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అధికార కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నామని,గ్రామంలో ఇప్పటికే ప్రభుత్వ పరంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేశామని,రాబోవు రోజుల్లో అంతర్గత సీసీ రోడ్లు,ఇండ్లు లేని వారికి ఇండ్లు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన ఇంటికి తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని,ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసి గ్రామాభివృద్ధికి పాటుపడతామని,ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.