ప్రతీ ఓటమి...మరో గెలుపుకు నాంది.
పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను తాను ఎప్పటికీ మరచిపోను.
భవిష్యత్తులో వారికి పార్టీలో తగిన గుర్తింపు, మంచి స్థానం కల్పిస్తా.
మాజీ మంత్రి డి.ఎస్. రెడ్యా నాయక్.
సర్పంచ్,వార్డు కంటెస్టెడ్ అభ్యర్థులను పరామర్శించిన మాజీ మంత్రి డి.ఎస్.ఆర్.
(నమస్తే న్యూస్, చిన్నగూడూరు, డిసెంబర్ 25)
పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను తాను ఎప్పటికీ మరచిపోనని, భవిష్యత్తులో వారికి పార్టీలో తగిన గుర్తింపు, మంచి స్థానం కల్పిస్తానని మాజీ మంత్రి డి.ఎస్. రెడ్యా నాయక్ అన్నారు.ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి విఫలమైన అభ్యర్థులను మాజీ మంత్రి, డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ పరామర్శించారు.గుండెంరాజుపల్లి గ్రామపంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థి చెక్కల శ్రీను అలాగే ఇతర వార్డు అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను తాను ఎప్పటికీ మరచిపోనని, భవిష్యత్తులో వారికి పార్టీలో తగిన గుర్తింపు, మంచి స్థానం కల్పిస్తానని తెలిపారు.అలాగే గుండంరాజుపల్లి గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


