నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
మరిపెడలో రూ.26 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం.
మరిపెడ వైద్యశాలలో పోస్టుమార్టం సేవలు ఏర్పాటు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్
(నమస్తే న్యూస్, మరిపెడ, డిసెంబర్ 20):
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కి భూమి పూజను చేశారు. ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇకపై పోస్టుమార్టం కోసం మహబూబాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రిలో సుమారు 40 మంది వైద్య సిబ్బంది సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
పేదల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్ము యుగంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్.కె. తాజుద్దీన్, అఫ్టల్, ఐలమల్లు, గుండగాని వెంకన్న, వేణు, సాయి, అభినవ రెడ్డి, అంబరీష్, రామ్లాల్, కాలం రవీందర్ రెడ్డి, దశ్రు నాయక్, కమలాకర్ రాజశేఖర్, అంబటి వెంకటరెడ్డి, బట్టు నాయక్, రాము నాయక్, లక్ష్మీపతి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

