పడమటిగూడెం పంచాయతీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:సర్పంచ్ ఉప్పలయ్య
(నమస్తే న్యూస్, నర్సింహులపేట, డిసెంబర్ 26)
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పడమటిగూడెం పంచాయతీ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య, ఉప సర్పంచ్ చిమ్ముల నవీన్ తెలిపారు.శుక్రవారం బొడ్రాయి సెంటర్‌లో మంచినీటి సరఫరా పైప్‌లైన్ మరమ్మతులు చేయాలని స్థానికులు కోరడంతో ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించి, సాయంత్రం నాటికి పనులను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు జక్కి మురళి, జొన్నగడ్డ యాకయ్య, చిమ్ముల కమలాకర్, షాజహాన్, ఉపేందర్, ఓర్సు మధు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

