ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి-డీఎస్పీ కృష్ణ కిషోర్
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, డిసెంబర్ 12):
రానున్న సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ కృష్ణ కిషోర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆదివారం జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు దంతాలపల్లి మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలైన దంతాలపల్లి, దాట్ల, పెద్ద ముప్పారం గ్రామాలలో తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు.ఈ పోలీస్ కవాతులో తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్, దంతాలపల్లి ఎస్సై రాజు, స్పెషల్ పార్టీ బృందాలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


