వాట్సాప్ గ్రూపుల్లో ఎస్బిఐ ఏపీకే పేరుతో సైబర్ మోసాలు.
(నమస్తే న్యూస్, నవంబర్ 23, మహబూబాబాద్)
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని, SBI APK పేరుతో అనుమానాస్పద ఫైళ్లు, పిడిఎఫ్ లు, లింకులను పంపిస్తున్నారు. వీటిని ఓపెన్ చేస్తే వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని సైబర్ భద్రత అధికారులు హెచ్చరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇలాంటి ఫైళ్లను తెరవవద్దని, వెంటనే డిలీట్ చేయాలని సూచించారు.