- ఏసీబీ వలలో తహశీల్దార్ మహేందర్ .
- పెద్దవంగరలో 25 వేల లంచం స్వీకరిస్తూ పట్టుబడిన ఎమ్మార్వో.
(నమస్తే న్యూస్ డెస్క్, నవంబర్ 28 – పెద్దవంగర)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ మెరుపుదాడులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పలువురు అవినీతి అధికారులు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నా, వసూళ్ల పర్వం మాత్రం ఆగట్లేదు.
తాజాగా మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు. పెద్దవంగర మండలంలోని పడమటి తండాకు చెందిన గిరిజన రైతు ధరావత్ మురళి నాయక్ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం తహశీల్దార్‌ను సంప్రదించగా, ఆయన ₹25,000 లంచం కోరినట్లు తెలుస్తోంది.అయితే, ఆ మొత్తాన్ని స్వీకరిస్తూ ఉండగానే ఏసీబీ అధికారులు దాడి చేసి రంగేహస్తులుగా పట్టుకున్నారు. ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అవినీతి అధికారులను కఠినంగా శిక్షించినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

