మహబూబాబాద్ జిల్లా
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డా.శబరీష్.
- పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్.
- కురవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నూతన జిల్లా ఎస్పీ డా.శబరీష్.
(నమస్తే న్యూస్, మహబూబాబాద్, నవంబర్ 24)
మహబూబాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా నియమితులైన డా. శభరీష్, ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ములుగు ఎస్పీగా పనిచేస్తున్న ఆయనను మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక ఎస్పీ కార్యాలయానికి చేరుకోగానే, బదిలీపై ములుగు జిల్లాకు వెళ్తున్న మాజీ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన డా. శభరీష్ జిల్లా పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశమై అనంతరం కురవి భద్రకాళి సమేత విరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆయన 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వారు. కర్ణాటక దేవగర్ లో ఎంబీబీఎస్ ను 2013లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఆలిండియా 617 ర్యాంకుతో ఐపీఎస్ సాధించారు. ఆయన మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ ఏఎస్పీగా పని చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా, అనంతరం మేడ్చల్ సైబరాబాదు కమిషనరేట్ కు డిప్యూటీ కమిషనర్ గా వ్యవహరించారు.అనంతరం ములుగు ఎస్పీగా నియమితులయ్యారు. ఆర్థిక నేరాల మీద పట్టుదలతో పని చేసి పలు కేసులు ఛేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో దర్యాప్తు అధికారిగా ఆయన కీలకంగా పని చేశారు.2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా చురుకుగా పని చేశారనే పేరుంది.
ములుగు లో జరిగిన ఆసియాలోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన మేడారం జాతరను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసలు అందుకున్నారు. శబరీష్ విద్యావంతుల కుటుంబం. ఆయన తండ్రి పి.పరప్పా హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్లో అసిస్టెంటు డైరెక్టర్గా పని చేస్తున్నారు.కాగా జిల్లా ప్రజల,యువత అభివృద్ధికి, శాంతి భద్రతలకు ఆటంకంగా ఉన్న రుగ్మతలను రూపుమాపి, ఇక్కడ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
![]() |
| కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న జిల్లా ఎస్పీ శబరిష్. |




