- జ్ఞాన సమాజ నిర్మాణ లక్ష్యంగా ముందుకు సాగుతాం-మహేందర్.
- ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జ్ఞాన సమాజ నిర్మాణ లక్ష్యానికి ప్రతీక-దర్శనాల ఉమేష్.

(నమస్తే న్యూస్,దంతాలపల్లి,నవంబర్ 23 )
జ్ఞానసమాజ నిర్మాణమే లక్ష్యంగా గురుకులాల అభ్యున్నతికి కీలకంగా సేవలందించిన మాజీ ఐపీఎస్ అధికారి, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జయంతిని పురస్కరించుకుని స్వేరోస్ ప్రతిజ్ఞ దివస్‌ను మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామంలోని అమ్మఒడి ప్రేమధరణాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వేరోస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బాషపంగు మాట్లాడుతూ ,శతాబ్దాలుగా అణచివేతలు, అన్యాయాలు ఎదుర్కొంటూ వెనుకబడిన వర్గాలను జ్ఞానసమాజం వైపు నడిపించాలనే దీర్ఘదృష్టితో ప్రవీణ్ కుమార్ స్వేరోస్ నెట్వర్క్‌కు అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. పరాజిత వర్గాలకు శక్తినిచ్చి విజయతీరాలకు తీసుకెళ్లాలన్న ఆంతర్యంతో ఆయన ప్రారంభించిన ఉద్యమం వేలాది మంది విద్యార్థులు, యువత జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. ప్రవీణ్ కుమార్ జయంతి సందర్భంగా ప్రతిఏటా నవంబర్ 23న స్వేరోస్ ప్రతిజ్ఞ దివస్‌ను నిర్వహించడం తమకు గౌరవంగా భావిస్తున్నామని మహేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శనల ఉమేశ్ స్వేరో, ఇండ్ల వెంకటేశ్వర్లు స్వేరో, చందు స్వేరో, నగేష్ మిడతపల్లి, అజిత్, సురేష్, నాగేష్, రవికిరణ్, అశోక్ స్వేరో తదితరులు పాల్గొన్నారు.
