రైల్వే డిపో తరలిపోద్దంటూ... సోషల్ మీడియాలో భారీగా ప్రచారం.?
రైల్వే ను కాపాడుకోవాలంటూ కరపత్రాలు.?
తరలిస్తే మహబూబాబాద్ లో మరో ఉద్యమమేనా..?
అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి..!
(నమస్తే న్యూస్, మహబూబాబాద్, నవంబర్ 21)
మహబూబాబాద్ కు రైల్వే శాఖ మంజూరు చేసిన రైల్వే మెగా మైంటెనెన్స్ డిపోను వేరే ప్రాంతానికి తరలించే కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు ప్రముఖంగా రావడంతో ప్రాజెక్ట్ సాధనకోసం అన్నివర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు నడుం బిగించాలని మహబూబాబాద్ పట్టణంలోని మజీద్ పాన్ షాప్ నిర్వాహకులు ఆవిష్కరించిన ప్రచార కరపత్రం సంచలనం సృష్టిస్తుంది.మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టు ఎంతో దోహదం చేస్తుందని ఎంఏ ఫరీద్, ఎంఏ వహీద్ లు పేర్కొన్నారు. మానుకోట కు మంజూరైన ప్రాజెక్టు స్టేషన్ ఘనపూర్ ప్రాంతానికి తరలి వెళ్తుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.రైల్వే ప్రాజెక్టు మానుకోటనుండి అన్యాయంగా తరలిపోకుండా అడ్డుకోవాలని వారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కాగా దీనిపై ప్రజల్లో ఆందోళన ఉదృతంగా మారకముందే సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించి ప్రజలకు నిజానిజాలను తెలియపరచాల్సిన అవసరం ఉంది.

