లింగమంతుల స్వామి నూతన ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీటీసీ కొమ్మినేని సతీష్ విరాళం
(నమస్తే న్యూస్, నవంబర్ 21,దంతాలపల్లి)
యాదవుల సంఘం ఆధ్వర్యంలో దాట్ల గ్రామంలో నిర్మాణం జరుగుతున్న కులదైవం లింగమంతుల స్వామి నూతన ఆలయ నిర్మాణానికి జిల్లాకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్మినేని సతీష్ 25,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆయన తన తండ్రి కొమ్మినేని రామయ్య జ్ఞాపకార్థంగా అందించారు.యాదవుల సంఘం ప్రతినిధులు ఆలయ నిర్మాణానికి కావాల్సిన నిధుల విషయం వివరించగా, వెంటనే స్పందించిన సతీష్ ఆర్ధిక సహాయం అందించడంతో గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సారకొల్ల గొల్ల మున్న లింగమల్లు, బోర రాజయ్య, కొండ కిష్టయ్య, వీరబోయిన లింగయ్య, ఆవుల సోమయ్య, ఆవుల లింగయ్య, పచ్చిపాల చంద్రయ్య, ఆవుల వీరయ్య, భయ్యా లింగయ్య, జెటంగి దేవేందర్, ఉప్పుల మహేష్, గూండాల మహేష్, గూండాల రమేష్, పచ్చిపాల మధు, గూండాల పప్పి, గూండాల ఐలయ్య, కొండ వీరయ్య, మున్న నాగమల్లు తదితరులు పాల్గొన్నారు.

