Type Here to Get Search Results !

నీట్ MBBS సీట్ సాదించిన లోకేష్ కు అండగా నిలిచిన మాస్ సంస్థ.

 నీట్ MBBS సీట్ సాదించిన లోకేష్ కు అండగా నిలిచిన మాస్ సంస్థ.
 నీరుపేద విద్యార్థి కి రూ. 20 వేలు ఆర్ధిక సహాయం అందజేత.
మాస్ సంస్థ ప్రతినిధులు డా. అలువాల విజయ్ కుమార్.



రిపోర్టర్: నరేందర్ పడిదం.

(నమస్తే న్యూస్, అక్టోబర్ 06, తొర్రూరు)

సమాజంలో నెలకొన్నఅసమానతలను తొలగించడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలలో మాదిగ విద్య కుసుమాలకు వారి ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో MBBS మంచిర్యాల మెడికల్ కాలేజీలో సీట్ సాధించిన తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు యాకయ్య కుమారుడు ధర్మారపు లోకేష్ నీరుపేద కుటుంబం కావడంతో మహా అది సేవ సమితి (MASS) సంస్థ అండగా నిలిచింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగలేకపోవడం తండ్రి యాకయ్య డయాలసీస్ పేషెంట్ తల్లి మైబూబా వ్యవసాయ కులీ కావడంతో తన ఉన్నతవిద్యకు ఆటంకం కలుగుతుందని భావించి మాస్ సంస్థ చేస్తున్న నీరుపేద మాదిగ విద్యార్థుల ఉన్నతచదువులకై అందిస్తున్న ప్రోత్సాహక సహాయ సహకారాలను తెలుసుకొని నాకు ఆర్ధిక సహాయం చేయగలరని సంప్రదించగా స్థానిక మాస్ సభ్యులా ద్వారా పూర్తిస్థాయి విచారణ అనంతరం వారికి ఈ రోజు సంస్థ సలహా మండలి తుది నిర్ణయం వారి ఆదేశాల మేరకు మాస్ సభ్యులు డా. అలువాల విజయ్ కుమార్ ఆద్వర్యంలో ధర్మారపు లోకేష్ కు కాలేజీ హాస్టల్ ఫీజు కోసం రూ. 20 వేలు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సంస్థ నీరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకై ఆసక్తి ఉండి, ఫీజులు పెండింగులు, సర్టిఫికెట్లు తీసుకోలేని వారికి ఆర్ధిక పరిస్థితిని విచారణ రిపోర్ట్ ఆధారంగా సహాయం చేయడం జరుగుతుంది. సంస్థ సభ్యులు రాయిశెట్టి యాకేoదర్, యూనివర్సిటీ పీజీ కాలేజీ అద్యపకులు డా. ధర్మారపు నాగయ్య, మాజీ ఉపసర్పంచ్ లు ధర్మారపు మహేందర్, ధర్మారపు వెంకయ్య, మంగళపెళ్లి చంటి తదితరులు పాల్గొన్నారు. సంప్రదించాలకునే వారు ఈ మొబైల్ నెంబర్ కి 9010730380, 9959697682 ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ డా. సినపెల్లి విజయ్ కుమార్ గారిని సంప్రదించవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.