తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా సోమారం నివాసికి డాక్టరేట్ ప్రదానం.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 07, తొర్రూరు)
'చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న, నా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చట' అన్నాడు భాస్కర శతకకర్త. భాస్కరుడు చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమవారం గ్రామ నివాసి గద్దల అనిల్ కడుపేద కుటుంబంలో పుట్టి పెరిగి, ఎన్ని సమస్యలు ఎదురైనా చదువును విడిచిపెట్టకుండా డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి చేతుల మీదుగా పీహెచ్డీ తెలుగు విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్నాడు గద్దల అనిల్. సోమారం గ్రామం, లో 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు తొర్రూరులో, 5, 6 తరగతులు శారద హైస్కూల్లో, 10వ తరగతి కొండాపూర్‌లో పూర్తి చేశాడు. ఆ తరువాత ఇంటర్మీడియట్ సిఇసి(C.E.C) విద్యను ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ జేఏసీ APSWRJC నర్సంపేటలో పూర్తి చేసుకొని- డిగ్రీ బి ఏ హెచ్ టి పి( B.A. H.T.P) విద్యను నిజాం కళాశాలలోను, ఎం.ఏ. తెలుగు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, టి.పి.టి. విద్యను నంద్యాల, ఎం.ఫిల్. విద్యను మద్రాసు విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. *'సరబాదముఖ్యప్రాణ్ రావు రచనలు - సమగ్ర పరిశీలన'* పేరుతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డా. రజనీ గారి పర్యవేక్షణలో సిద్ధాంత గ్రంథం సమర్పించి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. అంతటితో ఆగకుండా తాను చదివిన చదువు నలుగురికి ఉపయోగపడేలా నిజామాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నౌలెడ్జి టెక్నాలజీస్ (RGUKT BASAR)లో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా సోమారం గ్రామ ప్రజలు తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం శుభాకాంక్షలు తెలియ చేశారు.

