క్రమశిక్షణ గల కార్యకర్తగా ప్రజలకు సేవచేస్తా... అవకాశం ఇవ్వండి..!యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంపేట సురేష్ గౌడ్
రిపోర్టర్: నరేందర్ పడిదం.
(నమస్తే న్యూస్ దంతాలపల్లి,అక్టోబర్ 6 )
క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా దాట్ల గ్రామ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనేలా ఎంపీటీసీ టికెట్ తన భార్యకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంపేట సురేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ అధిష్టానాన్ని అభ్యర్థించాడు.ఈ సందర్భంగా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ ఎంపీటీసీ టికెట్ తన భార్య సంపేట లావణ్య కు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంపేట సురేష్ గౌడ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ ని కోరారు. సోమవారం ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్ కేటాయిస్తే దాట్ల గ్రామంలో ఏకగ్రీవం లేదా భారీ మెజారిటీతో గెలిపించి బహుమతిగా ఇస్తానని అన్నారు. ఈ కార్మంయక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ భట్టు నాయక్, దంతాలపల్లి మాజీ ఎంపీటీసీ నెమ్మది యాకయ్య, మిడతపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.