విధుల్లో నిజాయితీ, ప్రజల పట్ల మర్యాద అవసరం - ఎస్పీ సుధీర్ రాంనాధ్ కెకాన్.
(నమస్తే న్యూస్ ,అక్టోబర్ 18,మహబూబాబాద్)విధుల్లో నిజాయితీ, ప్రజల పట్ల మర్యాద అవసరమని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కెకాన్, ఐపీఎస్ అన్నారు. ఈ సందర్బంగా కేసముద్రం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను శనివారం సందర్శించారు. ఇటీవల ప్రారంభించిన కేసముద్రం మరియు ఇనుగుర్తి పోలీస్ స్టేషన్లలో పలు విభాగాలను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు.ఎస్పీ సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డుల సంరక్షణ, భౌతిక వసతులు, ప్రజలతో సంబంధాలు వంటి అంశాలపై సమీక్ష జరిపారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ పాటించాలని, ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పని చేయాలని సూచించారు.ప్రజలతో ఆశయవినిమయం జరిపి, పోలీస్ సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని ఎస్పీ గారు పేర్కొన్నారు. పోలీస్ శాఖ ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణ, చట్టసువ్యవస్థ కాపాడడంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు, కేసముద్రం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతికిరణ్, ఇనుగుర్తి ఎస్ఐ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
