- జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలి.
- జర్నలిస్టు కుటుంబానికి మిత్రులు చేయూతనందినించడం అభినందనీయం..
- చిన్నగూడూరు ఎస్ఐ పిట్ల ప్రవీణ్ కుమార్.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 19,చిన్నగూడూరు)
జర్నలిస్టులు ఐక్యంగా ఉండి సమాజ శ్రేయస్సు కోసమే కాకుండా తమ కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయాలని చిన్నగూడూరు ఏస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు .చిన్నగూడూరు మండల కేంద్రంలో జర్నలిస్టులు మధు,గిరి,శ్రీహరి,శేఖర్ ల తల్లి గారు ఇటీవల స్వర్గస్తులవడం తో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి 9 వేల రూపాయలు,క్వింటా బియ్యాన్ని ఇస్తూ తమ వంతు సహాయాన్ని ఎస్ఐ చేతుల మీదుగా అందించారు.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు సోదరభావం తో కలిసి మెలసి ఉండాలని ఆకాంక్షించారు.జర్నలిస్టు కుటుంబానికి తోటి జర్నలిస్టులు సహకరించుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష,కార్యదర్శులు చలమల్ల కిరణ్,గండి విష్ణు, సృజన్ తదితరులు పాల్గొన్నారు.

