క్రిమి సంహారక మందు సేవించి
బాలుడి మృతి.
(నమస్తే న్యూస్ , దంతాలపల్లి, అక్టోబర్ 10): పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందినట్లు ఎస్పై పిల్లల రాజు శుక్రవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బీరిశెట్టిగూడెం గ్రామ శివారు వాల్యా తండా గ్రామానికి చెందిన బానోత్ పద్మ నాగు దంపతుల కుమారుడు చరణ్ (12) నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలోని విజ్ఞాన్ హైస్కూల్ నందు హాస్టలో ఉంటూ 6వ తరగతి చదువుతున్నాడని, ఇటీవల దసరా పండుగ సెలవుల సందర్భంగా ఇంటికి రావడం జరిగిందని, సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడంతో తండ్రి అయిన నాగు తన కుమారుడు చరణ్ ను స్కూల్ కి వెళ్ళమనగా, అతను వెళ్ళను అని మారం చేయడం జరిగింది, అదే క్రమంలో హాస్టల్ కి పంపిస్తా అని తండ్రి అనడంతో తనని ఎలాగైనా హాస్టల్ కి పంపిస్తారు అని మనస్థాపం చెంది అదే రోజు ఉదయం 8 గంటలకు ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు త్రాగగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తొర్రూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినారు,ఆ బాలుడు చికిత్స పొందుతూ శు క్రవారం రాత్రి 12 గంటల సమయంలో చనిపోయాడని తండ్రి నాగు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

