బిఆర్ఎస్ పార్టీ లో చేరిన
"సేను రాజేష్ "
(నమస్తే న్యూస్ ,దంతాలపల్లి,అక్టోబర్ 9)
దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన సామాజిక విద్యావేత్త సేను రాజేష్ మండల నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,అనంతరం రెడ్యా నాయక్ మాట్లాడుతూ. సేను రాజేష్ పార్టీలోకి రావడం పార్టీకి మరింత బలం చేకూరింది అని అన్నారు. ముఖ్యంగా రాజేష్ పేద ప్రజలకు అందుబాటులో ఉంటు వారు చేస్తున్న సేవలకు అభినందనలు తెలిపారు, రాజేష్ తో పాటు వివిధ పార్టీల నుండి మరికొంత మంది కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. సేను రాజేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నా వంతు క్రుషి తప్పకుండా ఉంటుంది అని తెలిపారు.పార్టీ జాయినింగ్ కి సహకరించిన దంతాలపల్లి మాజీ సర్పంచ్ నాయిని శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కిషోర్,నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో మాజీ సర్పంచ్ కిషన్ నాయక్, ఎల్లు కృష్ణారెడ్డి, నెల్లూరి యాకన్న, పిఎసిఎస్ డైరెక్టర్ దర్శనాల వెంకన్న, శ్రావణ్ రొయ్యల సురేష్,బాద నరసయ్య, బాద అనిల్ కుమార్, సోమారపు నాగేష్, నెమ్మది వెంకన్న, గోనెల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


