గాంధీ జయంతి వేడుకలకు తహసీల్దార్ కార్యాలయం దూరం?
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, అక్టోబర్ 02)గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా అధికారిక కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో జాతీయ పిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. అయితే, దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం గాంధీ జయంతి వేడుకలు జరపకపోవడం స్థానిక ప్రజల్లో అసంతృప్తి కలిగించింది.జాతీయ పితకు నివాళులు అర్పించడం ప్రతి ప్రభుత్వ కార్యాలయపు కర్తవ్యం. కానీ తహసీల్దార్ కార్యాలయం ఈ వేడుకలను విస్మరించడంపై పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద జీతాలు తీసుకునే అధికారులు కనీసం పూలమాల వేసి గాంధీజీని స్మరించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం, చిన్న గ్రామపంచాయతీ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తుంటే, తహసీల్దార్ స్థాయి అధికారుల కార్యాలయం మాత్రం నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు.ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి కారణం చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

