రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
(నమస్తే న్యూస్, అక్టోబర్03,హైదరాబాద్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివదేహానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ నివాళులర్పించారు.బుధవారం రాత్రి దామోదర్ రెడ్డి మృతిచెందగా, ఈ రోజు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఎంపీ బలరాం నాయక్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దామోదర్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలుగు రాష్ట్రాలకు తిరుగులేని లోటు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల శ్రేయస్సుకోసం నిరంతరం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి” అన్నారు. అనంతరం అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.