గాంధీ జయంతి వేడుకలలో కానరాని అధికారులు
(నమస్తే న్యూస్,దంతాలపల్లి, అక్టోబర్ 2)
గాంధీ జయంతి రోజు… దేశం మొత్తం మహాత్ముని కి నివాళులు అర్పిస్తున్న వేళ, దంతాలపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మాత్రం అధికారులు కనిపించకపోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రతి నెలా లక్షల్లో జీతాలు తీసుకునే పెద్ద అధికారులు గాంధీ జయంతి వేడుకలకు దూరంగా ఉంటే, చాలి ,చాలని వేతనాలతో పనిచేసే గ్రామపంచాయతీ సిబ్బంది మాత్రం తమ స్థాయిలోనైనా వేడుకలు నిర్వహించడం ఆశ్చర్యకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.“మరణం కోసం ఓ రేటు, జనన ధ్రువీకరణ కోసం ఓ రేటు… కానీ గాంధీ జయంతి కోసం మాత్రం ఖాళీ కుర్చీలు!” అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.ప్రమాణ స్వీకార సమయంలో చెప్పిన విధి, నైతిక విలువలు, ప్రజాసేవ అనే మాటలు ఈ వేడుకల సందర్భంలో మరిచిపోయారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.“లక్షల్లో జీతాలు తీసుకునే మీరు పారిశుద్ధ కార్మికులతో కలిసి గాంధీ జయంతి వేడుకలు చేస్తే నిజమైన గౌరవం అవుతుంది.” అని పలువురు సూచించారు.ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యాలయంలో ఖాళీగా పడ్డ గాంధీ చిత్రపటాలు చూసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.గాంధీ జయంతి వేడుకల్లో కనీసం క్షణం సమయం కేటాయించి, ప్రజల్లో అవగాహన కలిగించే బాధ్యత నుంచి అధికారులు వెనకడుగు వేయడం,మహాత్ముని జయంతి వేడుకలపై నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

