రాష్ట్ర బీసీ బంద్‌కు
సత్యవతి రాథోడ్ మద్దతు
( నమస్తే న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 17): రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగనున్న బీసీ బంద్‌కు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ పూర్తి మద్దతు ప్రకటించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం చేపట్టిన బంద్ ఒక శాంతియుత నిరసన రూపమని ఆమె పేర్కొన్నారు.బీసీ వర్గాల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా నిలబడి బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు, విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.ఆమె మాట్లాడుతూ, “బీసీల శ్రేయస్సు కోసం పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. సమాజ అభివృద్ధికి ఇది ఒక ఆవశ్యక దశ” అని తెలిపారు. ప్రజలు, సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని బీసీ సమాజ ఐక్యతను చాటాలని కోరారు.బీసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని కూడా సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

