Type Here to Get Search Results !

ముంగిమడుగు సబ్‌స్టేషన్‌లో సి.ఎం.డి తనిఖీ

 ముంగిమడుగు సబ్‌స్టేషన్‌లో సి.ఎం.డి తనిఖీ



(నమస్తే న్యూస్, నరసింహులపేట, అక్టోబర్ 17 ): నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి,  శుక్రవారం ఉదయం ముంగిమడుగు 33/11 కెవి సబ్‌స్టేషన్ ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లో కొనసాగుతున్న ఆటోమేషన్ “DAC” (డేటా ఆక్విజిషన్ అండ్ కంట్రోల్), “RTFMS” (రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం) పనులను పరిశీలించి, వీటిని శీఘ్రం పూర్తి చేసి SCADA కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.మహబూబాబాద్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. విజయేందర్ రెడ్డి, డివిజనల్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్)  డి. సునీత లతో కలిసి సబ్‌స్టేషన్ ప్రగతిని సమీక్షించారు. జిల్లాలో మిగిలిన అన్ని 33/11 కెవి స్టేషన్లలో ఆటోమేషన్ పనులను నవంబర్‌లోపు పూర్తి చేయాలని, అలాగే మిగిలిన ఏడు 33 కెవి ఇంటర్‌లింక్ లైన్ పనులను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌ను సి.ఎం.డి  ప్రత్యక్షంగా కలుసుకుని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిడుగుల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయని, స్టాఫ్ కొరత ఉందని ఉద్యోగులు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన, త్వరలోనే ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, ప్రతి 11 కెవి లైన్‌లో లైటింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేయాలని ఏఈ పాండు ను ఆదేశించారు.తనివి తీరా సిబ్బందిని ఉద్దేశించి సి.ఎం.డి  మాట్లాడుతూ “ప్రతి లైన్ క్లియరెన్స్ (LC) ను ఆన్‌లైన్‌లో తీసుకొని, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. ఎర్తింగ్‌ పద్ధతులను అనుసరిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు,” అని సూచించారు.ఆయన ప్రతీ గ్రామంలో వినియోగదారుల సమస్యలను ఏ ఈ కి తెలియజేసి త్వరగా పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు కొత్త వాటిని ఏర్పాటు చేయాలని, లూజ్ లైన్లకు మధ్య పోళ్లు వేయాలని, రైతులకు సమయానికి విద్యుత్‌ సదుపాయం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో SE పి. విజయేందర్ రెడ్డి, డివిజనల్ ఇంజనీర్ బి. రవి (తొర్రూరు), డిఈ సునీత (MRT & కాన్స్ట్రక్షన్), ఏఈ పాండు (నరసింహులపేట) మరియు సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.