ఆటో-బైక్ ఢీకొని మహిళ మృతి
(నమస్తే న్యూస్, నరసింహులపేట, అక్టోబర్ 17):
నరసింహులపేట మండలంలోని కొమ్ములవంచ శివారులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — నరసింహులపేట గ్రామానికి చెందిన దినసరి కూలీలు సుమారు 15 మంది, ఫకీరా తండాకు చెందిన ఆటో డ్రైవర్ భూక్య హరికిషన్ (S/o నెహ్రు) ఆటోలో దంతాల గ్రామంలోని పత్తి పొలాలకు కూలీ పనికి వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా, కొమ్ములవంచ శివారులో ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్‌ను ఆటో డ్రైవర్ హరికిషన్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నరసింహులపేటకు చెందిన ఎర్నం తారమ్మ (w/o నంబయ్య), ఆవుదొడ్డి వినోద, మేకల సత్తెమ్మ అలాగే కొమ్ములవంచ గ్రామానికి చెందిన నెల్లూరు సంతోష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమంగా ఉన్న తారమ్మను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు.మృతురాలి కొడుకు ఎర్నం కరుణాకర్ (S/o సాంబయ్య) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ భూక్య హరికిషన్‌పై కేసు నమోదు చేసినట్లు నరసింహులపేట పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం. సురేష్ తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నరసింహులపేట పోలీస్ అధికారులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, వేగం నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

