మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా:రామచంద్రనాయక్
రిపోర్టర్: నరేందర్ పడిదం,తొర్రూరు డివిజన్
(నమస్తే న్యూస్,దంతాలపల్లి, అక్టోబర్ 06)
దంతాలపల్లి మండలంలో పలు కుటుంబాలను ప్రభుత్వ విప్, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సోమవారం పరామర్శించారు.మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధర్మారపు వెంకన్న తల్లి ధర్మారపు లింగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మృతురాలి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పరామర్శించారు. లింగమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం రామానుజపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒలాద్రి సత్తిరెడ్డి మరణించగా, మృతుని ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. సత్తిరెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుమారుడు గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డిని ఓదార్చారు. ఈ బాధాకర సమయంలో తాను మరియు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్బంగా గుగులోత్ భట్టు నాయక్, మండల నాయకులు కసిరెడ్డి నవీన్ రెడ్డి, గురుపాల్ రెడ్డి, పొన్నటి బాలాజీ, నెమ్మది యాకయ్య, ఏల్లు శ్రీనివాస్ రెడ్డి, కొమ్ము వాసు, రవీందర్, సంపత్, నెహ్రూ, సురేష్, యువజన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు.


