మరణించిన కుటుంబాలను పరామర్శించిన
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
✍️ రిపోర్టర్: నరేందర్ పడిదం,తొర్రూరు డివిజన్,
(నమస్తే న్యూస్, అక్టోబర్ 06, దేవరుప్పుల)
పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం దేవరుప్పుల మండలంలోని చిన్నమడూరు గ్రామానికి పర్యటించారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పరిదిలు యాదయ్య సతీమణి పరిదుల అంజమ్మ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న వేదన పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.అదేవిధంగా, అదే గ్రామానికి చెందిన మడికొండ లచ్చమ్మ కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే సందర్శించి పరామర్శించారు. ఈ బాధాకర సమయంలో తాను మరియు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ సందర్బంగా మండల పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.


