Type Here to Get Search Results !

ఘనంగా గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు.

 ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ, పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, వీడిసి చైర్మన్ ఆజాద్ చంద్రశేఖర్




రిపోర్టర్: నరేందర్  పడిదం,తొర్రూర్ డివిజన్.

(నమస్తే న్యూస్, దంతాలపల్లి, అక్టోబర్ 6)

ప్రజలు పాడిపంటలు ఆయురారోగ్యాలతో వి లసిల్లాలని ప్రజలందరినీ ఎల్లమ్మ తల్లి చల్లగా దీవించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ మరియు హైకోర్టు అడ్వకేట్ వీడిసి చైర్మన్ జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ కోరారు.

దంతాలపల్లి మండలం పంతులు తండా గ్రామం (బీరిశెట్టిగూడెం)లో నూతనంగా నిర్మించిన ఆలయంలో  అట్టహాసంగా నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, పోతరాజు స్వామి విగ్రహ ప్రతిష్టాపన  ఉత్సవాలలో సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా

ఆలయ ప్రాంగణంలో వేదపండితులు నిర్వహించిన మహా యాగశాలలో యాగం, పూర్ణాహుతి, అభిషేకాలు, ప్రత్యేక పూజలతో కార్యక్రమం వైభవంగా సాగింది. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, వీడిసి చైర్మన్ మరియు హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాద్ చంద్రశేఖర్, దాట్ల మాజీ సర్పంచ్ కొమ్మినేని రవీందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులందరికీ సుభిక్షం, శాంతి, సౌభాగ్యం కలగాలని రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రార్థించారు.గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బట్టు నాయక్, నాయకులు పొన్నోటి బాలాజీ, గురుపాల్ రెడ్డి, కసిరెడ్డి నవీన్ రెడ్డి, పడిదం లింగన్న, ఎస్కే జానీ పాషా, యువక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంపేట సురేష్ గౌడ్, నెమ్మది యాకయ్య, కమిటీ సభ్యులు బానోతు రామ్లాల్, ధరావత్ వెంకన్న, ధరావత్ స్వామి, బానోతు బద్రు, ధరావత్ కిస్టు, నాగన్న, కిషన్, వీరన్న, స్వామి సోములు, సంతోష్, శేఖర్, యాకూబ్, బాలాజీ, లచ్చు, రాములు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.